తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు.. విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

by GSrikanth |
తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు.. విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విభజన చట్టంలోని నిబంధనల ప్రకారం తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153 కి, ఏపీలో 175 నుంచి 225 వరకు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచేలా కేంద్రాన్ని ఆదేశించాలని ప్రముఖ పర్యావరణ నిపుణుడు ప్రొఫెసర్ కె. పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం, ఈసీ ఏపీ, తెలంగాణను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై సోమవారం జస్టిస్ జోసెఫ్, జస్టిస్ హృషికేష్ రాయ్ ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నప్పటికీ ఎనిమిదేళ్లుగా ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అదే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియ జరిగిందని వాటిని నోటిఫై చేసి త్వరలో ఎన్నికలకు వెళ్లబోతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్ విషయంలో ఒకలా, తెలుగు రాష్ట్రాల విషయంలో మరొకలా కేంద్రం ఎందుకు వ్యవహరిస్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు. వీటన్నింటిపై విచారించిన ధర్మాసనం ప్రతివాదులైన కేంద్రం, ఈసీ ఏపీ, తెలంగాణకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.

Advertisement

Next Story