Atrocious: ఘాట్ రోడ్డులో దారుణం.. చిరుత దాడిలో మాజీ సర్పంచ్ మృతి

by Indraja |   ( Updated:2024-06-26 07:03:32.0  )
Atrocious: ఘాట్ రోడ్డులో దారుణం.. చిరుత దాడిలో మాజీ సర్పంచ్ మృతి
X

దిశ వెబ్ డెస్క్: కట్టెల కోసం వెళ్లిన హహిళ చిరుత దాడిలో మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాలలోని గిద్దలూరుకి చెందిన మెహరున్నీసా అనే మహిళ కట్టెల కోసం గిద్దలూరులోని ఘాట్ రోడ్డులో ఉన్న అడవిలోని వంక వద్దకు వెళ్లింది. ఈ నేపథ్యంలో కట్టెలు సెకరిస్తున్న మెహరున్నీసా పై చిరుత దాడి చేసింది. కాగా ఈ ఘటనలో షేక్ మెహరున్నీసా మరిణించారు.

కాగా మెహరున్నీసా గతంలో సర్పంచ్ గా పనిచేశారు. మహిళ మృతితో స్థానికులంతా ఓక్కసారిగా బయభ్రాంతులకు గురైయ్యారు. వెంటనే ఈ ఘటనపై స్పంధించిన స్థానికులు, గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

Advertisement

Next Story

Most Viewed