అగ్నిప్రమాదం మృతులకు రూ. 50 లక్షలు ఇవ్వాలి.. యూత్ కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు అనిల్​యాదవ్​

by Javid Pasha |
అగ్నిప్రమాదం మృతులకు రూ. 50 లక్షలు ఇవ్వాలి.. యూత్ కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు అనిల్​యాదవ్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: సికింద్రాబాద్​ స్వప్నలోక్​ కాంప్లెక్స్​ అగ్నిప్రమాద మృతులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 50 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ ​జాతీయ అధ్యక్షుడు అనిల్ ​యాదవ్​ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. శుక్రవారం గాంధీ ఆస్పత్రి ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అగ్రి ప్రమాదంలో ఏకంగా ఆరుగురు వ్యక్తులు మృతి చెందడం బాధకరమన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇలాంటివి జరుగుతున్నాయన్నారు. గతంలో ప్రత్యేక చట్టం తెస్తామంటూ ప్రకటనలు ఇచ్చినా.. ఇప్పటికీ అమలు కాలేదన్నారు. కేవలం కాలక్షేపం చేస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. సంఘటనలు జరిగినప్పుడే హాడావిడి చేస్తూ సర్కార్​ నిర్లక్ష్య వైఖరి చూపుతోందన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోకపోతే వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు ప్లాన్​ చేస్తామని అనిల్ యాదవ్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story