Kishan Reddy: తెలంగాణలో సమస్యలు పరిష్కారం కావటం లేదు: కిషన్ రెడ్డి

by D.Reddy |
Kishan Reddy: తెలంగాణలో సమస్యలు పరిష్కారం కావటం లేదు: కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ఆదిలాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అభయహస్తం మొండి హస్తంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. రోజూ ఓ ప్రకటన ఇవ్వడం తప్ప.. 14 నెలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు. నిరుద్యోగులు, ఉపాధ్యాయుల సమస్య పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో సమస్యలు పరిష్కారం కావటం లేదన్నారు.

చేయూత పేరు వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, కల్లు గీత కార్మికులకు, చేనేత కార్మికులకు నెలకు రూ.4 వేల ఫించన్ ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ నేటికి అమలు చేయలేదన్నారు. అలాగే ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ కడతామని చెప్పారని, అది కూడా అతి గతి లేకుండా పోయిందని కిషన్ రెడ్డి అన్నారు. పేదలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా కూడా రాష్ట్రంలో అమలు కావటం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆరోగ్య బీమా ఐదు లక్షలు పొరుగు రాష్ట్రాల్లో అమలు అవుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ పుణ్యమా అని ఈ పథకం రాష్ట్రంలో అమలు కాలేదని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అమలు చేయటం లేదని ఆరోపించారు. 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలకు నిధులు కూడా మంజూరు చేయటం లేదని కేంద్ర మంత్రి అన్నారు.

Next Story

Most Viewed