‘థగ్‌లైఫ్’ ఫస్ట్ సింగిల్ విడుదల.. ఆ స్టార్ హీరో నా ఫ్రెండ్ అనడానికి గర్వపడుతున్నా అంటూ కమల్ ఆసక్తికర కామెంట్స్

by Hamsa |   ( Updated:2025-04-18 11:42:49.0  )
‘థగ్‌లైఫ్’ ఫస్ట్ సింగిల్ విడుదల.. ఆ స్టార్ హీరో నా ఫ్రెండ్ అనడానికి గర్వపడుతున్నా అంటూ కమల్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థగ్‌లైఫ్’. మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో త్రిష(trisha), అభిరామి(Abhirami) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో స్టార్ హీరో శింబు (simbu) కీలక పాత్రలో నటిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దీనిని రెడ్ జాయింట్ మూవీస్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 5న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో మూవీతో మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా, ‘థగ్‌లైఫ్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ‘‘జింగుచ్చా’’ సాంగ్ విడుదలైంది.

ఇందులో పెళ్లి వేడుకలో భాగంగా కమల్ హాసన్, శింబు అదిరిపోయే స్టెప్స్ వేశారు. ఇక ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా కమల్ హాసన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘37 ఏళ్ల క్రితం నేను మణిరత్నం దర్శకత్వంలో ‘నాయకన్’లో చేశాను. అప్పుడు, ఇప్పుడు ఆయనలో ఎలాంటి మార్పు కనిపించలేదు. మేమిద్దరం కథ గురించి చర్చించుకునే సమయంలోనే 25 శాతం సినిమా అయిపోయినట్లుగా అనిపిస్తుంది. అయితే షూటింగ్ మాత్రం ప్రతిరోజు మంచి ముహూర్తంలోనే స్టార్ట్ చేసేవాళ్లం. మా చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కానీ నాకు మాత్రం ఒక్కరు కూడా ఐ లవ్ యూ అని చెప్పలేదు. ఇండస్ట్రీలో శింబు లాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు. తను నా స్నేహితుడు అనడానికి గర్వపడుతున్నా. ఇండస్ట్రీలో 45 ఏళ్ల క్రితంతో పోలిస్తే చాలా మార్పు వచ్చింది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.





Next Story

Most Viewed