- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Kishan Reddy: ఎంఐఎంకు ఆ రెండు పార్టీలు జీ హుజూర్ అంటున్నాయ్.. కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎంఐఎం (MIM) పార్టీకి కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు ‘జీ హుజూర్’ అంటూ సలాం కొడుతున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇవాళ నాంపల్లి (Nampally) పార్టీ ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ (BJP) మతోన్మాద పార్టీ అంటూ విమర్శిస్తున్నారని.. తమ పార్టీ రాజాకార్లను వ్యతిరేకించే పార్టీ అని తెలిపారు. అందుకే తమ పార్టీ మజ్లీస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని అన్నారు. అలాంటి మజ్లీస్ నాయకులకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ‘జీ హుజూర్’ అంటూ సలాం కొడుతున్నాయని ఆరోపించారు.
బీజేపీని ఓడించాలనే ఆ మూడు పార్టీల లక్ష్యం
ఆ పార్టీలు ఎంఐఎంకు అన్ని రకాలుగా అండగా ఉంటూ కొమ్ము కాస్తున్నాయని కామెంట్ చేశారు. బీజేపీని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ తెర వెనుక కలిసి పని చేస్తున్నాయని అన్నారు. బీజేపీని విమర్శించే నైతిక హక్కు రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి, కేసీఆర్ (KCR)కు లేదని ఫైర్ అయ్యారు. కానీ, తాము రాజాకార్ల వారసులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. బీజేపీ (BJP)పై ఆ మూడు పార్టీల సిద్ధాంతం ఒక్కటేనని.. ఓకే మాట మీద ఉంటారని ధ్వజమెత్తారు. తెలంగాణ (Telangana)లో జెండా ఎగురువేయాలనే లక్ష్యంతో మజ్లిస్ ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో చాపకింద నీరులా అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో విస్తరిస్తున్నారని కామెంట్ చేశారు. మజ్లీస్ పార్టీకి ఏజెంట్‌గా కాంగ్రెస్.. కనుసన్నల్లో బీఆర్ఎస్ ఉన్నాయని కిషన్ రెడ్డి అన్నారు.