ఆప్‌కు షాక్.. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ముందు అనూహ్య పరిణామం!

by Satheesh |
ఆప్‌కు షాక్.. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ముందు అనూహ్య పరిణామం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. తాజాగా ఓ కౌన్సిలర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బవానాకు చెందిన కౌన్సిలర్ పవన్ షెహ్రావత్ శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. శుక్రవారం ఎంసీడీ స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే పోలింగ్‌కు కొద్దిసేపటి ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తీరుపై పవన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ పార్టీలో అవినీతితో ఊపిరి ఆడలేదని ఆరోపించారు. ఎంసీడీ కార్యాలయంలో సభ్యులు రచ్చ చేయాలంటూ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయని ఆరోపించారు. ఈ విషయాల పట్ల తాను ఆవేదనకు గురై పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.

Advertisement

Next Story