అల్లు అర్జున్‌పై పరోక్షంగా పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-08 11:12:29.0  )
అల్లు అర్జున్‌పై పరోక్షంగా పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: స్మగ్లింగ్ పాత్రలు చేసే హీరోలపై జనసేన, అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కర్ణాటక పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడ మీడియాలో మాట్లాడారు. ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోలు అందరూ అడవులను కాపాడే పాత్రలు చేసేవారని.. ఇప్పుడు స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పాత్రలు చేయడం వల్ల సమాజానికి మంచి చేయడం పక్కన బెడితే.. చెడు ఎక్కువ చేసిన వారిమి అవుతామని అభిప్రాయపడ్డారు. కాగా, పుష్ప సినిమాలో మెగా హీరో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. దీంతో తమ హీరోను ఉద్దేశించే పవన్ కల్యాణ్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, అంతకుముందు పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కలిశారు. ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని చర్చించుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేయాలని సిద్ధరామయ్యను పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా కోరారు. అలాగే కర్ణాటక నుండి 6 కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వాలని ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రిని కోరారు. పొలాల మీద, ఊళ్ళ మీద పడే ఏనుగులను తరిమేందుకు కుంకీ ఏనుగులు ఉపయోగపడతాయని, ప్రస్తుతానికి ఏపీలో రెండు మాత్రమే ఉన్నాయని, పొరుగు రాష్ట్రం కర్ణాటకలో వీటి సంఖ్య ఎక్కువని అటవీశాఖ అధికారులు గతంలో పవన్‌కి వివరించగా.. ఇపుడు కర్ణాటక పర్యటనకు వెళ్ళిన పవన్ కళ్యాణ్ తానే స్వయంగా అక్కడి ప్రభుత్వాన్ని కుంకీ ఏనుగులు కావాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed