AP News: అప్పుడు నిద్రమత్తు.. ఇప్పుడు వదిలిందా..? వైసీపీపై నెటిజన్స్ ఫైర్..

by Indraja |   ( Updated:2024-06-23 12:04:31.0  )
AP News: అప్పుడు నిద్రమత్తు.. ఇప్పుడు వదిలిందా..? వైసీపీపై నెటిజన్స్ ఫైర్..
X

దిశ వెబ్ డెస్క్: గత ప్రభుత్వం అనాలోచిత పాలనలో ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తమైంది. నియంత పాలనను తలపించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్టర్ కుంటుపడింది. అవినీతి అక్రమాలతో ఆంధ్రా ప్రజలు అల్లాడిపోయారు అని అనడానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితమై, కనీసం ప్రతిపక్ష హోదాను సైతం దక్కించుకోలేక పోవడమే నిదర్శనం అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా అఖండ మెజారిటీతో గెలుపొందిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ఐదేళ్లలో జరిగిన అవినీతి అక్రమాలపై దృష్టిసారించిందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

యథా రాజా తథా ప్రజా..

రాజు ఎలా ఉంటే ప్రజలు సైతం అలానే ఉంటారు. గత ప్రభుత్వంలో నేతలను ప్రజలు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంది కేవలం భూతులు మాట్లాడడానికేనా అని ప్రజలే అసహ్యించుకునేలా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యవహరించారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలానే దొరికినంత దోచుకో, దోచుకుంది దాచుకో అనేలా వైసీపీ నేతల తీరు ఉండేదని, వారి బాటలోనే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం నడిచారని, ప్రజల కోసం కాకుండా కేవలం వైసీపీ కోసమే పని చేశారని ప్రజలు పేర్కొంటున్నారు.

అయితే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో గాడితప్పిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అక్రమార్కులపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దీనితో ప్రభుత్వ అధికారులు సైతం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లల్లో నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా వందల కోట్లను వ్యచించి వైసీపీ హయాంలో పార్టీ కార్యాలయాలను నిర్మించారు. కాగా వాటిపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే కొన్నింటిని ధ్వంశం చేయగా మరి కొన్నంటికి నోటీసులు ఇచ్చారు.

అప్పుడు నిద్రమత్తు.. ఇప్పుడు వదిలిందా..?

తమ పార్టీ కార్యాలయాలను కూల్చి వేయడంనై వైసీపీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని, గత టీడీపీ ప్రభుత్వంలో కేవలం 1,000 రూపాయలకి లీజుకి తీసుకుని, చంద్రబాబు నాయుడు గారు కట్టుకున్న పూరి గుడిసె ఇదే అంటూ టీడీపీకి సంబంధించిన ఓ బిల్డింగ్ ఫోటోను షేర్ చేసింది. అలానే ఈ లీజు ద్వారా, ఈ స్థలం ఏకంగా 99 సంవత్సరాల పాటు టీడీపీకే సొంతం అనేలా చట్టవిరుద్ధంగా రాయించుకున్నారని.. ఇలాంటి భూములు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కాజేసారని ఆరోపించింది.

కాగా ఈ పోస్ట్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. నిజంగా చంద్రబాబు ప్రభుత్వం అలా చేసి ఉంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అనుమతులు తీసుకుని కట్టిన, ప్రజల ఆస్తి అయినటువంటి ప్రజా వేదికనే కూల్చిన మీకు, నిజంగా చంద్రబాబు అడ్డదారిలో ఆ భవనాన్ని నిర్మించినట్టు మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే చర్యలు తీసుకోకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు.. అధికారంలో ఉన్నప్పుడు నిద్రపోయారా..? ఆ నిద్రమత్తు మీ అక్రమాలను బయటపెడుతుంటే వదిలిందా..? అంటూ రాయడానికి సైతం వీలు కాని పధజాలంతో కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed