DSC: డీఎస్సీ పై వైసీపీ ఆరోపణలు.. నెటిజన్స్ ఫైర్

by Indraja |
DSC: డీఎస్సీ పై వైసీపీ ఆరోపణలు.. నెటిజన్స్ ఫైర్
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు, ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీపై వైసీపీ విమర్శలు కురిపిస్తోంది.

మెగా డీఎస్సీ అంటూ తెలుగుదేశం పార్టీ మెగా మోసానికి పాల్పడిందని వైసీపీ ట్విట్టర్ వేదికగా మండిపడింది. అధికారంలోకి రాగానే 25వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో గొప్పలు చెప్పిన టీడీపీ అధికారంలోకి రాగానే తొలి సంతకంతో 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ అంటూ డ్రామాలు ఆడుతోంది అని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అలానే వాటిలో 6,100 పోస్టులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినవే అని వైసీపీ ట్వీట్ చేసింది. కాగా వైసీపీ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్స్‌ మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకంగా 16,347 పోస్టులకు గాను డీఎస్సీ విడుదల చేశారని, అయితే మీ ప్రభుత్వంలో అది కూడా ఇవ్వలేదు కదా మరి ఎందుకు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అని, నీ బొందరా నీ బొంద, కుక్కతోక వంకర అంటూ వైసీపీపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed