- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికులను పట్టించుకోవడం లేదు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: గల్ఫ్ కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని కోరుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో బుధవారం గల్ఫ్ కార్మికుల జేఏసీ నాయకులు పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. సొంత ఊరిలో కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను వదిలి ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టి దేశం కాని దేశంలో అసువులు బాసితే ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాలకు అతీతంగా గల్ఫ్ కార్మికులు జేఏసీగా ఏర్పడి ఉద్యమానికి మద్దతు తెలిపి, రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన గల్ఫ్ కార్మికులను ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ, దేశానికి లక్షల కోట్ల విదేశీమారక ద్రవ్యం సమకుర్చుతున్నా అటు కేంద్రం గానీ గల్ఫ్ కార్మికులను పట్టించుకోవడం లేదని అన్నారు. తెలంగాణలో స్థానికంగా ఉపాధి అవకాశాలు లభించకపోవడంతో ఆరంభం నుండి ఇక్కడి ప్రజలు ఉపాధి నిమిత్తం గల్ఫ్ బాట పట్టారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి గల్ఫ్ బాట పట్టడం తగ్గుతుందని భావిస్తే, తగ్గకపోగా మరింత పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ వెళ్లిన కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా సంక్షేమ, సహాయక కార్యక్రమాలు చేపదుతారని ఆశిస్తే నిరాశే ఎదురైందని అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుండి ఇప్పటివరకు తెలంగాణలో గల్ఫ్ కార్మికులకు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
గల్ఫ్ లో తెలంగాణ నుండి సుమారు 10 లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారని, ఒక్కో కార్మికుడు అర్జించిన ఆదాయంలో కనీసం రు.10,000 స్వదేశానికి పంపుతుండడంతో ప్రతి నెల కనీసం రు.1000 కోట్ల విదేశీ మారకద్రవ్యం సమకూరుతోందని అన్నారు. గల్ఫ్ కార్మికులు స్వదేశానికి సంవత్సరానికి రు.12 వేల కోట్ల చొప్పున 9 ఏళ్లలో సుమారు లక్ష కోట్ల విదేశీ మార్గద్రవ్యం రూపంలో సమకూర్చారని చెప్పారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కేంద్రంగాని, రాష్ట్రంగాని ఎటువంటి సహాయం అందించకపోవడం బాధాకరమని అన్నారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.