- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మండుటెండల్లోనూ చెప్పులు ధరించకుండా అభివృద్ధి పనుల్లో మంత్రి సత్యవతి..!
దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: గత మూడు రోజులుగా ఎండలు మండుతున్న తరుణంలో మంగళవారం గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చేపట్టిన పర్యటన ఆసక్తికరంగా మారింది. సుమారు 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో మంత్రి చెప్పులు లేకుండా అభివృద్ధి పనుల్లో పాల్గొనడం అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడంతో పాటు కేసీఆర్ ప్రధాని అయ్యేంతవరకు తన పాదాలకు చెప్పులు ధరించనంటూ గత మునుగోడు ఎన్నికల నేపథ్యంలో శపథం పూనినట్లు చర్చ జరుగుతుంది. అప్పట్లో ఈ అంశంపై వార్తలు కూడా వెలువడ్డాయి.
కానీ ప్రస్తుతం దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి దేశంలో ఏమో కానీ రాష్ట్రంలోనూ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అన్న చర్చలో భాగంగా తన నిర్ణయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదన్నట్లుగా తాను చేస్తున్న పర్యటనలో తన పాదాలకు చెప్పులు లేకుండానే కనిపించింది. ఎర్రటి ఎండలో నడవాల్సి వచ్చిన సందర్భంలోనూ ఎండకు తట్టుకుంటూనే చెప్పులు లేకుండానే నడిచారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండానే తన గిరిజన మహిళలతో స్టెప్పులు కూడా వేశారు. వచ్చే ఎన్నికల్లోను తనకు టికెట్ దక్కాలని హైకమాండ్ దృష్టిలో పడేలా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఉండొచ్చని మరో వర్గం చర్చించుకుంటున్నారు.