- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శాసన సభ్యుడి గా కొడాలి నాని ఎదిగారు అంటే ఎన్టీఆర్ పెట్టిన భిక్ష : టీడీపీ నేత అనిత
దిశ,ఏపీ బ్యూరో: మాజీ మంత్రి,వైసిపీ నేత కొడాలి నాని రాజకీయంగా ఎదిగారంటే అది ఎన్టీఆర్ పెట్టిన భిక్ష అన్నారు. టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత విశాఖ పట్నం లో విలేకరులతో మాట్లాడుతూ.. అలాంటి మహానుభావుడు ఎన్టీఆర్ కడుపున పుట్టిన ఆడ బిడ్డ మీద ఇష్టానుసారంగా మాట్లాడం సరైనది కాదని అన్నారు.పాలు ,సారాయి కి తేడా తెలియని మనుషులు వైసిపీ లో ఉన్నారన్న ఆమె ఇంత జరుగుతున్నా సీఎం జగన్మోహనరెడ్డి కి తెలియాదా.. అని ఆరోపించారు. క్యాబినెట్ లో రాష్ట్ర సమస్యలు మాట్లాడటం మానేసి, ప్రతిపక్ష నేత మీద మాట్లాడుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అమ్మతనం కోసం తప్పుగా మాట్లాడితే దిశా చట్టం కింద కేస్ పెట్టరా అని ప్రశ్నించారు. కొడాలి నాని ఇంటి ముందు రోడ్ వేయించుకోలేరు గాని లోకేష్ , చంద్రబాబు లను దూషిస్తున్నారని మండిపడ్డారు. కొడాలినానికి చిత్త శుద్ధి ఉంటే భువనమ్మ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.
అమరావతి యాత్ర పై అనిత:
విశాఖ లో వైసిపీ ఎమ్మెల్యే, మంత్రులు అన్నం తింటున్నారా లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజధాని విషయం పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ ను ఇక్కడే ఉంచే ప్రయత్నం చెయ్యండని అన్న అనిత రైతులను మాత్రం ఏమైనా చేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు.దండయాత్ర అంటే ఇదికాదనీ. నిజానికి రైతులు దండయాత్ర చేయాలి అనుకుంటే ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి కూడా బయటకు రాలేరని అన్నారు.అమరావతి రైతు యాత్ర లో ఎక్కువ మంది మహిళలే పాల్గొంటున్నారన్న ఆమె,సీఎం జగన్ ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారనీ,రుషి కొండ గుండు గిసినట్టు దోచేశారని ఆరోపించారు.ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డలుగా చెప్పుకునే వారు ఈ మూడేళ్ళు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర లో ఉన్న మంత్రులు రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. రాజధాని పేరు చెప్పి ఒక్క ఇటుక వెయ్యలేదని అన్నారు. మూడు రాజధానులు వ్యవహారం ముగిసిన అధ్యాయమనీ..దాన్ని సీయం జగన్ మెహన్ రెడ్డి తనకుతానే ముగించారని అన్నారు.