- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోంశాఖ మంత్రి Amit Shah తో Junior NTR భేటీ
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. మునుగోడు బహిరంగ సభ అనంతరం సాయంత్రం ఐదు గంటలకు జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యాలయం నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షాతో డిన్నర్‌కు బీజేపీ నేతలు ఎన్టీఆర్‌ను ఆహ్వానించారు. దీంతో వీరిద్దరు ఏయే అంశాలపై చర్చిస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1:30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకోనున్న అమిత్ షా... నేరుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం మనోహర్ హోటల్‌లో ముఖ్యమైన 20 మంది రైతు సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత బన్సీలాల్ పేట డివిజన్‌లోని దళిత కార్యకర్త ఇంటికి వెళ్లి పరామర్శిస్తారని సమాచారం. అక్కడ నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో నల్గొండ జిల్లా మునుగోడు బహిరంగ సభకు వెళ్లనున్నట్లు బీజేపీ శ్రేణులు వెల్లడించారు. మీటింగ్ అనంతరం శంషాబాద్ నోవాటెల్‌లో బీజేపీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, జూనియర్ ఎన్టీఆర్‌తో లంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన అమిత్ షా ఎన్టీఆర్ నటనకు ఫిదా అయినట్లు తెలుస్తోంది. తారక్ నటన మెచ్చి ఆహ్వానించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి : Fixed Deposits పై ఏ ఏ బ్యాంకులు ఎంత మొత్తం వడ్డీ ఇస్తున్నాయో తెలుసా..?