Breaking News: సైకిల్‌కి ఓటు వేసి గెలిపించండి.. వైసీపీ ఎంపీ అభ్యర్థి

by Indraja |
Breaking News: సైకిల్‌కి ఓటు వేసి గెలిపించండి.. వైసీపీ ఎంపీ అభ్యర్థి
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. కాగా మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో నేతలు అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అభ్యర్థులు, ఆచితూచి మాట్లాడాల్సిన నేతలు మాట్లాడే సమయంలో తడబడుతున్నారు. ఫలితంగా ప్రత్యర్థికి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నారు.

తాజాగా వైసీపీ ఎంపీ అభ్యర్థి సైకిల్‌కి ఓటు వేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. వివరారాల్లోకి వెళ్తే.. ఈ రోజు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు.

కాగా ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి, మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మిద్దె శివరాం, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయ శేఖర్ రెడ్డి, అడ్వకేట్ రామచంద్రారెడ్డి, నెరవాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అయితే వెంటనే తన తప్పును సరిచేసుకుని ఫ్యాన్‌కి ఓటు వేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Advertisement

Next Story

Most Viewed