- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Politics: ఉరుమురిమి మంగళం మీద పడడం అంటే ఇదే కాదా..?!
దిశ వెబ్ డెస్క్: అధికారంలో ఉన్నా, కనీసం ప్రతిపక్షంలో సైతం లేకున్నా వాళ్లకు తెలిసింది ఒక్కటే ఇతరులపై బురదజల్లడం అని పలువురు వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవరు ఏమన్నా తమ పంథా మార్చుకోవడంలేదు వైసీపీ సోషల్ మీడియా మూఖలు. ఎక్కడ ఏది జరిగినా దానికి కారణం టీడీపీనే అని అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు వైసీపీ యత్నిస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా బాపట్లలోని భట్టిప్రోలు మండలం అద్దేపల్లి దళితవాడలో వైఎస్ఆర్ విగ్రహానికి అల్లరిమూకలు నిప్పు పెట్టాయి. కాగా ఈ ఘటనకు టీడీపీనే కారణం అంటూ ట్విట్టర్ వేదికగా వైసీపీ ఆరోపిస్తోంది. ‘భట్టిప్రోలు మండలం అద్దేపల్లి దళితవాడలో వైయస్‌ఆర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కార్యకర్తలు, జూన్ 4 నుంచి కక్ష సాధింపు రాజకీయాలతో రాక్షసానందం పొందుతున్న టీడీపీ, హుందా రాజకీయాలు అంటే ఇవేనా..?’ అంటూ ట్వీట్ చేసింది. కాగా వైసీపీ చేసిన ట్వీట్‌పై టీడీపీ స్పందించింది.
‘మొన్నటి ఎన్నికల్లో, ఘోర ఓటమికి మీరంటే మీరు కారణం అంటూ "ఒరిజినల్" వైఎస్ఆర్ అభిమానులు, జగన్ రెడ్డి అభిమానుల మధ్య గొడవ జరిగి, జగన్ రెడ్డి సైకో ఫ్యాన్స్, వైఎస్ఆర్ అభిమానులు పెట్టిన వైఎస్ విగ్రహానికి నిప్పు పెట్టారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.’ అంటూ వైసీపీ ట్వీట్‌కు టీడీపీ రీట్వీట్ చేసింది. కాగా ఈ ట్వీట్‌లు చూసిన నెటిజన్స్ వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు మీరు కొట్టుకుని టీడీపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని, ఉరుమురిమి మంగళం మీద పడడం అంటే ఇదే కదా అంటూ ఎద్దేవా చేస్తున్నారు.