AP Politics: జగన్ బండారం బయటపెట్టిన ప్రముఖ వైసీపీ మాజీ ఎమ్మెల్యే..

by Indraja |
AP Politics: జగన్ బండారం బయటపెట్టిన ప్రముఖ వైసీపీ మాజీ ఎమ్మెల్యే..
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రా ప్రజలతో పాటు యావత్ భారతదేశం ఉత్కంఠంగా ఎదురుచూసిన ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం పరిమితమైంది. వైసీపీ ఇంతటి పరాజయాన్ని చవిచూడడంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా వైసీపీ ఓటమిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని తెలిపిన ఆయన, ఒక కులం కాదు అన్ని కులాలు కలిసి వైసీపీని ఓడించాయని పేర్కొన్నారు. అలానే స్థానిక సమస్యల పరిష్కారానికి జగన్ కార్యాలయానికి వెళ్లి, తమ సమస్యల గురించి వివరించి ఆర్జీని ఆయనకే అందిస్తే, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ ఆ సమస్యల పరిష్కారం గురించి యోచన చేయకుండా, ఆ అర్జీని సంబంధిత అధికారుల చేతిలో పెట్టే వారని, తాము పెట్టుకున్న అర్జీ పై ఒక సంతకం కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేదని, కొన్ని సందర్భాల్లో రాత్రి 11 గంటల వరకు కూడా పడిగాపులుకాసిన రోజులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తాము పెట్టుకున్న ఆర్జీ పై ఒక్క సంతకం పెడితే ఆ నియోజకవర్గంలోని 10 పదివేల మంది ప్రజలకు మంచి జరుగుతుంది అని కూడా తెలియని స్థితిలో అధికారులు ఉన్నారని మండిపడ్డారు. ఇలాంటి నిర్లక్ష్యపూరిత ఘటనలే వైసీపీ ఓటమికి బాటలు వేశాయని తెలిపారు. అలానే జగన్ చుట్టూ అధికారులు, కోటరీ చేరి ఆయనను ఒక భ్రమలో ఉంచారని అన్నారు.

ఎన్నికలు ముగిసిన తరువాత ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లి ప్రపంచమంతా మన వైపు చూడబోతోందని, వై నాట్ 175 అన్నారంటే ఆయన ఎంత బ్రమలో ఉన్నారో అర్థమవుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story