- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీలోకి టీమిండియా మాజీ కెప్టెన్ MS.Dhoni ?
దిశ, డైనమిక్ బ్యూరో: టీమిండియా మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమైట్ ఎంఎస్ ధోనీ రాజకీయ ప్రవేశంపై మరోసారి జోరుగా చర్చ జరుగుతోంది. తాజాగా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోపై ప్రస్తుతం ఇంటర్నెట్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎంఎస్ త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఇందుకు ఈ ఫోటోనే సాక్ష్యం అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ధోనీ రాజకీయాల్లోకి రాబోతున్నారని గత కొంత కాలంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అమిత్ షా తో మోడీ దిగిన ఫోటో హల్‌చల్ చేయడం ఆసక్తిగా మారింది. అయితే ఈ ఫోటో వెనుక రాజకీయ కోణం ఏమీ లేదని మరి కొంత మంది వాదిస్తున్నారు. ఇండియా సిమెంట్ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తమిళనాడులో ఏర్పాటు చేసిన వేడుకలకు అమిత్ షా హాజరయ్యారు.
ఇండియా సిమెంట్ కంపెనీ బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ యజమాని శ్రీనివాస్ యాజమాన్యంలోనే ఉంది. దీంతో ఈ కార్యక్రమానికి ఎంఎస్ ధోనీ సైతం హాజరయ్యారు. ఈ వేడుకలో అమిత్ షా, ధోనీ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ కావడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ధోనీ రాజకీయాల్లోకి వస్తున్నాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ధోని పొలిటికల్ ఎంట్రీపై రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తునప్పటికీ ఆయన మాత్రం ఇటీవల కొత్తగా ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరో వైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో సెలబ్రిటీ జోష్ పెరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లోని సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులను తమ వైపు తిప్పుకోవడంలో కమలనాధులు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో చేరుతున్న స్టార్స్‌కు అంతే స్థాయిలో ఆదరణ లభిస్తుండటంతో కాషాయ కండువా కప్పుకునేందుకు ఆసక్తి నానాటికీ పెరుగుతోంది. ఈ క్రమంలో గతేడాది ఏడాది క్రితం పార్టీలో చేరిన ఇండియన్ క్రికెటర్ భార్య రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యేగా టికెట్ కన్ఫర్మ్ చేసింది. జామ్ నగర్ నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు.
- Tags
- dhoni