- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'చిరంజీవికి నాగార్జునకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది'
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ పై సీపీఐ నేత నారాయణ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ బలపడటానికి సీఎం కేసీఆర్ కారణం అని అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. ఎంఐఎం బ్లాక్ మెయిల్ నుంచి కేసీఆర్ బయటపడాలని సూచించారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ సహవాసం కారణంగానే రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకుందని ఆరోపించారు. ఎంఐఎం భుజంపై తుపాకీ పెట్టి బీజేపీని కేసీఆర్ కాల్చే ప్రయత్నం చేస్తున్నారని ఇది సరైనది కాదని అన్నారు. ఇలా చేయడం వల్ల బీజేపీ బలపడి ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం కలుగుతుందన్నారు. జాతీయ సమైక్యతా ముసుగులో తెలంగాణ సాయుధ పోరాటాన్ని మరుగున పడేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. తాము జాతీయ సమైక్యతకు వ్యతిరేకం కాదని అయితే ఈ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర ప్రధానమైనదని అన్నారు.
చిరంజీవికి నాగార్జునకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా:
తాను బిగ్ బాస్ షో పై చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సినిమా రంగం అంటే కేవలం నాగార్జున మాత్రమే కాదని ఇంకా అనేక మంది నటీనటులు ఉన్నారని చెప్పారు. చిరంజీవికి నాగార్జునకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని కామెంట్స్ చేశారు. ప్రజల ఆరోగ్యం కోసం కోట్ల రూపాయల అడ్వర్టైజ్ మెంట్లను చిరంజీవి వదులుకుంటే, కేవలం డబ్బు కోసమే నాగార్జున బిగ్ బాస్ షో చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బిగ్ బాస్‌ను బ్రోతల్ హౌస్ అన్న తన మాటలకు కట్టుబడి ఉన్నానని బ్రోతల్ హౌస్‌లో మహిళలతో పాటు పురుషులు కూడా ఉంటారని చెప్పారు. ఈ వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తాను మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశాననేలా వివాదాస్పదం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను బ్లాక్ మెయిల్ చేయడం ఎవరి వల్ల కాదన్నారు. సమాజంపై చెడు ప్రభావాన్ని చూపిస్తున్న బిగ్ బాస్ షోను మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నాను. సినిమా అన్న సినిమా రంగానికి చెందిన కళాకారులన్న తనకు అపారమైన గౌరవం ఉందన్నారు.
ఇవి కూడా చదవండి : చిరంజీవి vs నాగార్జున.. గెలుపెవరిది?