- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Deputy CM Bhatti : జార్ఖండ్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం : డిప్యూటీ సీఎం భట్టి
దిశ, వెబ్ డెస్క్ : జార్ఖండ్( Jharkhand) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) పార్టీ విజయం ఖాయమని పార్టీ స్టార్ క్యాంపయినర్ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ధీమా వ్యక్తం చేశారు. రాంచీలోని జేకే హాల్‌లో సంవాద్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికలలో ప్రచార వ్యూహాలు, ఎన్నికల హామీలు, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ పురోగతి కోసం వ్యూహరచన చేస్తుందని చెప్పారు. కూటమి ఎన్నికల హామీలు, కార్యక్రమాల గురించి చర్చించడంతో పాటు చేపట్టా్ల్సిన కార్యక్రమాలను నిర్ధేశించుకున్నామని ఆయన తెలిపారు. కార్యకర్తలంతా సమన్వయంగా పనిచేస్తే మనం జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
దేశాన్ని రక్షించడం కోసం, రాజ్యాంగ మౌళిక సూత్రాలను కాపాడడంతో పాటు దేశ వనరులను కాపాడుకోవాలంటే ఇండియా కూటమికి ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుత బీజేపీ పాలనలో సంపన్న పెట్టుబడి దారులు ఈ దేశాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. బీజేపీ పాలనలో దేశం నానాటికి వెనక్కి వెళుతుందని విమర్శించారు. దళిత, బలహీన వర్గాలు, మైనార్టీలు సహా అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ సహా అ పార్టీ జాతీయ, రాష్ట్ర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.