- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాక్షస పాలనకు వ్యతిరేకంగా సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర: కేవీపీ రామచందర్ రావు
దిశ, జడ్చర్ల / నవాబ్ పేట: కేంద్రంలో రాక్షస పాలన, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అమలుకు వ్యతిరేకంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తెలంగాణలో ప్రజా స్వామిక పాలనకు మద్దతు ఇస్తున్నదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేత కేవీపీ రామచందర్ రావు అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం రుక్కంపల్లి వద్ద ఆగి, విరామం తీసుకుంటున్న భట్టి విక్రమార్కను కేవీపీ పరామర్శించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో మత రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించారు. మోడీ ఆర్థిక విధానాలు పూర్తిగా పేదల బతుకులపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నదని అన్నారు. ఈడీ, సీబీఐ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రతిపక్షాలపై ఉసిగొల్పి అధికారం కోసం కుట్రలు చేస్తున్నదని తెలిపారు.
రాష్టంలో సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో స్వర్గీయ వైఎస్సార్ చేపట్టిన పాదయాత్ర తరహాలోనే తాజాగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతున్నదని ఆయన తెలిపారు. అప్పట్లో రైతుల ఆత్మహత్యలకు నిరసనగా వైఎస్సార్ పాదయాత్ర చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను సీఎం కేసీఆర్ ప్రభుత్వం గుంజుకొని వ్యాపారం చేస్తున్నదని, దీన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేయడం శుభపరిణామమని అన్నారు. త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ ఎంపీ మల్లురవి తదితరులు ఉన్నారు.