AP Politics: ఎన్నికల బరిలో బావామరదళ్ల సవాల్.. వైసీపీ అభ్యర్థులకు తప్పని ఇంటిపోరు

by Indraja |   ( Updated:2024-04-19 11:06:04.0  )
AP Politics: ఎన్నికల బరిలో బావామరదళ్ల సవాల్.. వైసీపీ అభ్యర్థులకు తప్పని ఇంటిపోరు
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇల్లు గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. కానీ వైసీపీ అభ్యర్ధులకు మాత్రం ఇంట్లోనే ప్రత్యర్ధులు తయారైయ్యారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌‌పై ఆయన సతీమణి వాణి పోటీకి సిద్ధమయ్యారు.

దువ్వాడ శ్రీనివాస్‌‌కు ఇంటిపోరు తప్పలేదు అనుకుంటే.. ఈ కోవలోకి తాజాగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం అభ్యర్థి చేరారు. వివరాల్లోకి వెళ్తే.. గంగాధర నెల్లూరు నియోజవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే ఆమెపై తన సొంత అత్త కొడుకు రమేష్ పోటీ చేసేందుకు సిద్ధమైయ్యారు.

కాగా రమేష్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెల్లి కొడుకు. గత ఎన్నికల్లో తన మామ నారాయణ స్వామి కోసం రమేష్ పని చేశారు. కాగా రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆశించిన రమేష్‌కు నిరాశే మిగిలింది. దీనితో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే రమేష్‌కి వైసీపీ శ్రేణుల్లో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాలు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

Advertisement

Next Story