Ram Mohan Naidu: రాజకీయం అంటే తెలియని వ్యక్తి.. 36 ఏళ్లకే కేంద్రమంత్రి ఎలా అయ్యారు..?

by Indraja |
Ram Mohan Naidu: రాజకీయం అంటే తెలియని వ్యక్తి.. 36 ఏళ్లకే కేంద్రమంత్రి ఎలా అయ్యారు..?
X

దిశ వెబ్ డెస్క్: రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినా అసలు రాజీకీయం అంటే ఏంటో సైతం తెలియకుండా పెరిగిన వ్యక్తి ఆయన. తండ్రి రాజ్యసభ సభ్యులు అయినా ఎన్నడూ రాజకీయ ప్రచారంలో సైతం పాల్గొన్నదే లేదు. కొమ్మ చాటు పిందెలా ఆడుతూ పాడుతూ సాగుతున్న తన జీవితాన్ని తండ్రి మరణ వార్త కుదిపేసింది. తండ్రి పార్ధివ దేహాన్ని చూసేందుకు తడోపతండాలుగా తరలివచ్చిన ప్రజలను చూసి, బతికితే తన తండ్రిలా ప్రజా సేవలో బతకాలనే ప్రేరణ కలిగింది.

అలా 26 ఏళ్లకే కేంద్రంలో ఎంపీగా అడుగు పెట్టారు. 36 ఏళ్లకే కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అతనే కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆయన గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కింజరాపు రామ్మోహన్ నాయుడు బాల్యం, విద్యాభ్యాసం..

కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకులం జిల్లాలోని నిమ్మాడ గ్రామంలో విజయలక్ష్మి , ఎర్రన్నాయుడు దంపతులకు డిసెంబరు 18, 1987 న జన్మించారు. కాగా ఆయన ఒకటో తరగతి నుండి మూడో తరగతి వరకు శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ హాస్టల్‌లో ఉండి చదువుకున్నారు. అయితే ఆయన తండ్రి ప్రముఖ రాజకీయ వేత్త కావడం, 1994 లో తన తండ్రి పార్టీ చీఫ్ విప్ అవ్వడంతో ఫ్యామిలీ హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యింది.

ఈ నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్ లో నాలుగు, ఐదు తరగతులు చదివారు. అనంతరం1996 లో ఎర్రన్నాయుడు ఎం.పిగా ఎన్నికైయ్మారు. దీనితో ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఈ క్రమంలో మళ్లీ ఫ్యామిలీ డిల్లీకి షిఫ్ట్ అయ్యింది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఆర్.కె.పురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేరిన రామ్మోహన్ నాయుడు అక్కడే పదో తరగతి వరకు చదువుకున్నారు. అలానే డిల్లీలోనే ఇంటర్ పూర్తి చేశారు. అనంతరం విదేశాలలో ఎం.బి.ఎ పూర్తి చేసి తిరిగి భారత్‌కు వచ్చారు.

రాజకీయ అరంగేట్రం..

రాజ్యసభ సభ్యునిగా ఉన్న కింజరాపు ఎర్రన్నాయుడు 2012 నవంబర్ 2న ఓ వివాహానికి హాజరై తిరిగివస్తున్న సమయంలో ఆయన రోడ్డు ప్రమాధంలో మరణించారు. తండ్రి మరణ వార్త తెలుసుకున్న రామ్మోహన్ నాయుడు విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. కాగా ఎర్రన్నాయుడు కుమారుడు హైదరాబాద్ వస్తున్నట్టు తెలుసుకున్న చంద్రబాబు స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి రామ్మోహన్ నాయుడును రిసీవ్ చేసుకున్నారు.

అనంతరం ఆయన కాన్వాయ్‌లోనే రామ్మోహన్ నాయుడును ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు. ప్రయాణంలో రామ్మోహన్ నాయుడు గురించి అన్ని విషయాలు తెలుసుకున్న చంద్రబాబు, ఆ తర్వాత కాలంలో రామ్మోహన్ నాయుడుకు టీడీపీ తరుపున ఎంపీ టికెట్ ఇచ్చారు.

దశాబ్ధకాలంలో ఓటమి ఎరగని నేత.. ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోయిన అధికార పార్టీ..

తొలిసారిగా 2014 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన రామ్మోహన్ నాయుడు ప్రత్యర్థిపై అత్యధిక మెజారిటీతో గెలిచి పార్లమొంట్‌లో అడుగు పెట్టారు. అయితే ఆయన ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టినప్పటికి ఆయనకు రాజకీయ పరిజ్ఞానం లేకున్నా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలపై మంచి పట్టు ఉంది. ఆయలో ప్రశ్నించే తత్వం ఉంది. ఇదే ఆయన్ని అగ్రస్థానంలో నిలుచోబెట్టింది. 2018లో టీడీపీ ఎన్‌డిఏ కూటమి నుండి బయటకు వచ్చాక ఆంధ్రులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోదని పార్లమెంట్‌లో అవిశ్వాస తిర్మాణాన్ని ప్రవేశపెట్టారు.

ఆ సమయంలో రామ్మోహన్ నాయుడు ఆవేశంగా హిందీలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీరు చిరస్మరనీయం అని అందరూ అంటారు. కాగా అవిశ్వాస తిర్మాణంలో రామ్మోన్ నాయుడు 15 నిమిషాలు మాట్లాడారు. ఈ పదిహేను నిమిషాలు ఆయన ప్రసంగాన్ని చూసి అందరూ నిశ్చేష్టులైయ్యారు. అలానే రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నల్లో ఒక్క ప్రశ్నకు సైతం అప్పటి కేంద్ర ప్రభుత్వం సామాధానం చెప్పలేక పోయిందంటే రామ్మోహన్ నాయుడు భాషా పరిజ్ఞాణం ఎలాంటిదో అర్థమౌతుంది.

ఇక 2019 ఎన్ని్కల్లో బడాబడా నేతలు సైతం ఓటమిని చవి చూశారు అలాంటి గడ్డుకాలంలోనూ గెలుపొంది పార్లమెంట్‌లో అడుగు పెట్టారు. టీడీపీకి పార్లమెంట్‌లో కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉడడంతో మాట్లాడేందుకు అతి తక్కువ సమయాన్ని ఇచ్చేవారు. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారం లేకపోయినా రామ్మోహన్ నాయుడు తన గళంతో పార్లమెంటులో టీడీపీ ఉనికిని చాటారు. కేంద్రంతో పోరాడి శ్రీకాకులం నుండి తిరుపతికి అలానే విశాఖపట్నం నుండి వారనాశికి రైలును మంజురు చేయించి విశాఖ వాసుల కలను నెరవేర్చారు. 2024 ఎన్నికల్లో సైతం భారీ విజయాన్ని సాధించి హ్యట్రిక్ కొట్టారు. కాగా ఆయన దశాబ్ధకాలంగా ఆయన చేసిన కృషికి 2024లో కేంద్ర మంత్రి పదివి వరించింది.

Advertisement

Next Story

Most Viewed