- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాజీమంత్రి.. చెక్ పెట్టబోయి చిక్కుల్లో!
దిశ, మహబూబ్‌నగర్: ‘ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు’ అనే నానుడి మాజీమంత్రి లక్ష్మారెడ్డికి సరిగ్గా సరిపోతుంది. ఆయన ద్వారా పార్టీలోకి వచ్చిన యువనేత ఆయన వెనుక నుంచి గొయ్యి తీయడం మొదలు పెట్టడంతో లక్ష్మారెడ్డి పరిస్థితి కూడా తన గొయ్యి తానే తీసుకున్నట్లు అయింది. పార్లమెంట్ ఎలక్షన్ టైంలో జితేందర్‌రెడ్డికి చెక్ పెట్టేందుకు మన్నె శ్రీనివాస్‌రెడ్డిని టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకువచ్చిన లక్ష్మారెడ్డి హైకమాండ్‌ను ఒప్పించి టికెట్ ఇప్పించడంలో సక్సెస్ అయ్యారు. అతను విజయం సాధించడంతో డబుల్ సక్సెస్ కొట్టారు.
ఇంతవరకు ఓకే. కానీ, ఇప్పుడు ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి అన్నకొడుకు జీవన్‌రెడ్డి జడ్చర్ల నియోజకవర్గంపై లుక్కేసినట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు కూడా పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల క్రితం ఆయన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహించి తన మనసులోని మాటను వెల్లబుచ్చినట్లు సమాచారం. తన బాబాయి ఎంపీ కావడంతోపాటు జడ్చర్ల నియోజకవర్గం కూడా ఆయన పరిధిలోకి వస్తుండటంతో జీవన్‌రెడ్డికి కూడా కలిసి వచ్చే అంశంగా మారింది. బాబాయి సాయంతో ఇప్పటికే నియోజకవర్గంలో తన సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా వ్యూహాత్మకంగా జరిగిపోయిందని పార్టీలో చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే లక్ష్మారెడ్డికి ప్రస్తుతం మంత్రి పదవి లేకపోవడంతో కొంతకాలంగా నియోజకవర్గంపై దృష్టి సారించడం తగ్గించారు. అటు.. బాబాయితో తిరుగుతూ జీవన్‌రెడ్డి జడ్చర్ల నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. దీనికి తోడు ఆర్థికంగా బలంగా ఉండటం, యువకుడు కావడంతో యూత్ లీడర్స్ మొత్తం ఆయనవైపే మొగ్గు చూపుతున్నారు. ఈ విషయాలను మొత్తం పరిగణనలోకి తీసుకొని కొంత ఆలస్యంగా తేరుకున్న లక్ష్మారెడ్డి నియోజకవర్గంపై దృష్టి పెట్టి పట్టు నిలుపుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా జీవన్‌రెడ్డితో కలిసి ఉన్న నాయకులను తన వైపు తిప్పుకునేందుకు పకడ్బందీగా పావులు కదుపుతున్నారు. అయితే పార్టీలో డిఫరెంట్ పరిస్థితులు నెలకొనడంతో కార్యకర్తలకు కూడా ఎవరివైపు వెళ్లాలన్నది అర్థం కాకుండా మారింది. మొత్తంగా లక్ష్మారెడ్డి ద్వారా పార్టీలోకి వచ్చిన నాయకుడు ఇప్పుడు ఆయనకే మేకుగా మారడంతో జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.