- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరేళ్ల బాలిక కిడ్నాప్.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు
దిశ, చార్మినార్: కిడ్నాప్‌కు గురైన ఆరేండ్ల బాలికను కాంచన్‌బాగ్ పోలీసులు 24 గంటల్లోనే సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. శంషాబాద్‌లోని ఓ దంపతులకు రూ. 15 వేలకు విక్రయించడానికే మహిళ కిడ్నాప్‌కు పాల్పడినట్లు సౌత్ జోన్ డీసీపీ గజరావు భూపాల్ తెలిపారు. మంగళవారం పురానా హవేలిలోని డీసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో వివరాలు వెల్లడించారు.
డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం..
అంబర్పేట్అలీకేఫ్ ప్రాంతానికి చెందిన ముస్కాన్ఆలీ మీర్జా(41) తన కూతురు అల్ఫియా(6)తో కలిసి భిక్షాటన చేస్తూ కాలం వెల్లదీస్తోంది. ఈ నెల 13వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో చంచల్‌గూడలో బిక్షాటన చేస్తుండగా ఓ మహిళ వాళ్ల దగ్గరికి వచ్చి తన పేరు ఫాతిమా అని.. హఫీజ్‌బాబానగర్‌లో ఓ స్వచ్ఛంద సేవా సంస్థ పెద్ద ఎత్తున బట్టలు, డబ్బు దానం (జకాత్) ఇస్తుంటారని నమ్మబలికింది. వెంటనే వారిని ఆటోలో ఎక్కించుకుని హఫీజ్‌బాబానగర్‌కు చేరుకుంది. అక్కడే ఉన్న ఓ ఇంటిని మీర్జాకు చూపెట్టింది. ఆ ఇంటి యజమాని వద్దకు వెళ్లి జకాత్తీసుకో అని మాయమాటలు చెప్పింది.
ఆటో దిగి కాస్త ముందుకు మీర్జా వెళ్లగానే ఆరేండ్ల మైనర్‌బాలికతో ఆటోలో ఫాతిమా పరారయ్యింది. వెంటనే స్టేషన్‌కు పరిగెత్తిన తల్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కాంచన్‌బాగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని.. సంతోష్నగర్డివిజన్ఏసీపీ శివరాం శర్మ పర్యవేక్షణలో బృందాలను రంగంలోకి దింపారు. హఫీజ్‌బాబానగర్ నుంచి రెండు ఆటోలను మార్చుతూ ఫాతిమా బాలికతో శంషాబాద్‌కు చేరుకుంది. అక్కడి నుంచి షాద్‌నగర్‌లోని సొంత ఇంటికి బాలికను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినట్లు సాంకేతిక ఆధారాలతో పోలీసులు గుర్తించారు. పోలీసులు వెంటనే ఫాతిమాగా చెప్పుకున్న ఆసియాబీ(26) ను అదుపులోకి తీసుకుని కిడ్నాపర్చెర నుంచి బాలికకు విముక్తి కలిగించారు. ఇది ఇలా ఉంటే శంషాబాద్పోలీస్స్టేషన్పరిధిలో ఆసియాబీ పై అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు కేసు కూడా ఉన్నట్లు డీసీపీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సౌత్ జోన్ అదనపు డీసీపీ సయ్యద్రఫీక్, సంతోష్నగర్ఏసీపీ శివరాం శర్మ, కాంచన్బాగ్ఇన్స్పెక్టర్జి. వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.