- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీసీపీ శ్రీనివాస్ రెడ్డి
దిశ, రఘునాథపల్లి: అసాంఘిక శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడుగడుగునా నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలు, దొంగతనాలకు అడ్డుకట్ట పడుతుందని వెస్ట్ జోన్ జనగామ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎసిపి రఘు చందర్ లు అన్నారు. ఆదివారం రఘునాథపల్లి మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యం లో ముమ్మరంగా కార్డ్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి డీసీపీ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.. సీసీ కెమెరాలు ఉన్నచోట దొంగతనాలకు అవకాశం ఉండదన్నారు. దినదినంగా రఘునాథపల్లి అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యం లో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి ఉండడంతో ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రతి వీధిలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
నేరాలు, దోపిడీలు, దొంగతనాలు, నిర్మాణాలకు సీసీ కెమెరాలు సాక్ష్యం గా నిలుస్తాయని అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు జనగామ జిల్లాలోని ప్రతి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గంజాయి, గుట్కా అమ్మినా, దగ్గర ఉన్నా, రవాణా చేసినా, చట్టరీత్యా నేరమని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
చట్టవ్యతిరేక కార్యక్రమాలను ఎట్టి పరిస్థితిలో సహించబోమని అన్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు డ్రైవింగ్ లైసెన్స్ లేని 34 వాహనాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్ సబ్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ నాయక్ , తిరుపతి రమేష్ నాయక్, వివిధ పోలీస్ స్టేషన్ ఎస్సైలు సిబ్బంది ఎంపీటీసీ పేర్ని ఉష రవి, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పోకల శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.