ఎంపీ అరవింద్ పోలీసులకు క్షమాపణ చెప్పాలి !

by Shyam |
ఎంపీ అరవింద్ పోలీసులకు క్షమాపణ చెప్పాలి !
X

దిశ, క్రైమ్ బ్యూరో: సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్‌ను అసభ్య పదజాలంతో దూషించి, హెచ్చరించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్.. పోలీసులకు క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు వై. గోపిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఎన్నికలు ఉన్నందున జిల్లా పోలీసు యంత్రాంగం భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తోందనే విషయాన్ని గ్రహించాలన్నారు. పోలీసులు, అధికారులకు రాజకీయ ఉద్దేశాలను ఆపాధించడం పార్లెమెంటు సభ్యుడిగా తగదని హితవు పలికారు. సోషల్ మీడియాలో కల్పిత వీడియోల ఆధారంగా నిజానిజాలు తెలుసుకోకుండా సదరు ఎంపీ వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story