తనను రేప్ చేశారని యువతి ఫిర్యాదు.. పట్టించుకోని పోలీసులు!

by srinivas |
తనను రేప్ చేశారని యువతి ఫిర్యాదు.. పట్టించుకోని పోలీసులు!
X

దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లాలోని పెళ్ళకూరు మండలంలోని పోలీస్ స్టేషన్ లో తనను రేప్ చేశారని ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని యువతి మహిళా కమిషన్ ను ఆశ్రయించింది. దీని వివరాల్లోకి వెళ్తే…పెళ్లకూరు మండలానికి చెందిన తనను కొందరు వ్యక్తులు అపహరించి, శ్రీకాళహస్తి ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపింది. దీనిపై పెళ్లకూరు పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు పట్టించుకోవడం లేదని తెలిపింది. పోలీసులు పట్టించుకోకపోవడంతోనే తాను మహిళ కమిషన్‌ను ఆశ్రయించానని‌ తెలిపింది.

Advertisement

Next Story