- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బైక్ దొంగల ముఠా అరెస్టు
దిశ ప్రతినిధి, వరంగల్ : హైదరాబాద్, వరంగల్ పట్టణ పరిసర ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలను దొంగలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను ఆదివారం హన్మకొండ సివిల్, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠా సభ్యులపై సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు నిఘా వేసి ఉంచారు. చోరీ చేసిన వాహనాలను విక్రయించేందుకు పద్మాక్షి గుట్ట వైపు వస్తున్నట్లుగా తెలుసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి తొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో వరంగల్ అర్భన్ జిల్లా పోచమ్మమైదాన్ ప్రాంతానికి చెందిన బరివట్ల సాయి, కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన కటకం ప్రణయ్, హైదరాబాద్ బాలనగర్‌కు చెందిన బోనగిరి విజయ్ ఆలియాస్ కన్నాను అరెస్టు చేశారు.
అయితే ఇదే ముఠాకు చెందిన మరో నిందితుడు వరంగల్ శివనగర్‌కు చెందిన వులిచేరు చందు అలియాస్ చంద్రశేఖర్ కొద్దిరోజుల క్రితమే పోలీసులకు చిక్కాడు. మిగిలిన ముగ్గురిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. బరిపట్ల సాయి 2017 నుంచి 2020 మధ్య కాలంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కాజీపేట, సుబేదారి, కేయూసి, మట్టేవాడ, ఇంతేజా గంజ్, మీ కాలనీ, మహబూబాబాద్,గుండాల, హైదరాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో తాళం వేసిన ఇండ్లల్లో చోరీలతో పాటు ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడ్డాడు. పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే తాజాగా నిందితుడిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.