పోలీసులనూ వదలని… సైబర్ నేరగాళ్లు

by Sumithra |
పోలీసులనూ వదలని… సైబర్ నేరగాళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: సమాజం అభివృద్ధి చెందుతున్నా కొద్ది మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీని ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు, దోపిడీ దొంగలు, సైబర్ నేరగాళ్ల నుంచి అమాయక ప్రజలను రక్షించాల్సిన పోలీసులు కూడా మోస పోతున్నారు. అమాయకులను టార్గెట్ చేస్తూ ఆన్‌లైన్ ద్వారా లక్షలు దోచేస్తున్నారు. ఒకప్పుడు బడా వ్యాపారులు, సినిమా వాళ్లు, ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించి మోసం చేసిన కేటుగాళ్లు, ప్రస్తుతం ఎవరినీ వదలకుండా సామాన్యులపై కూడా వారి ప్రతాపం చూపిస్తున్నారు. తాజాగా పోలీసులు, ప్రభుత్వ అధికారులే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్నారు.

అధికారులకు ఉన్న ఆన్‌లైన్ ఖాతాలైన ఫేస్ బుక్‌లో ప్రొఫైల్ ఫోటోలు సేవ్ చేసుకొని వారి ఫొటోలతో నకిలీ ఫేస్ బుక్ క్రియేట్ చేస్తున్నారు. అనంతరం వారి స్నేహితులకు అర్జెంట్ డబ్బులు కావాలని మెసేజ్‌లు పెట్టి మోసం చేస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కొంతమంది పోలీసులు సోమవారం హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న సైబర్ పోలీసులు.. ఎవరికైనా గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి డబ్బులు పంపించండి కోరితే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఎంక్వేరీ చేసుకోవాలని సూచించారు.

Read Also…

మొగల్రాజపురంలో భారీ దోపిడీ

Advertisement

Next Story