- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని హత్య
దిశ, నిజామాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ భార్య. ప్రియుడు, తల్లిదండ్రుల సహకారంతో వాగులో పూడ్చిపెట్టి.. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు పోలీస్ స్టేషన్‌లో కనబడుట లేదని ఫిర్యాదు చేసింది. అయితే, ఈ ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా.. పోలీసులు స్పందించడం లేదని గ్రామస్తులు ఒత్తిడి తెచ్చారు. దీంతో తమ శైలిలో విచారణ చేసిన పోలీసులు అసలు నిజం బయటపెట్టారు. భర్తను హత్య చేసింది తానే అని భార్య ఒప్పుకుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మంధర్నాలో శుక్రవారం జరిగిన ఓ మిస్సింగ్ కేసు.. చివరకు మర్డర్ అని తేలడంతో స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి మండలం కోల్లూర్కు చెందిన సిరిగిరి సాయిరాంకు బోధన్ మండలం మంధర్నాకు చెందిన గంగామణితో 10 సంవత్సారాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరు సంవత్సరాల పాప ఉంది. సాయిరాంకు స్వగ్రామంలో పని దొరక్కా అత్తగారి గ్రామమైన మంధర్నాలో కూలీ పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, అదే గ్రామానికి చెందిన సుభాష్ అనే వ్యక్తితో గంగామణికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంపై భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో భర్తను హత్య చేసేందుకు గంగామణి, ప్రియుడు సుభాష్, తల్లిదండ్రుల సహకారంతో పథకం వేశారు. దీని ప్రకారం ఈ నెల 8న రాత్రి సాయిరాం ఇంటివద్ద ఉండగా.. అతడి గొంతు నులిమి చంపివేశారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా స్థానికంగా ఉన్న మంజీర వాగులో పూడ్చిపెట్టారు. గంగామణి కదలికలపై అనుమానం ఉందని అత్తమామలు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు విచారణ జరపగా అసలు విషయం బయటపడింది.