గజ్వేల్‌లో ఫామ్‌హౌస్‌పై రైడ్.. 25 మంది అరెస్ట్..

by Shyam |   ( Updated:2021-12-16 09:53:07.0  )
Gajwel
X

దిశ, గజ్వేల్: పేకాట స్థావరంపై దాడి చేసి జూదగాళ్ళ నుండి పెద్ద మొత్తంలో పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో రాజీవ్ రహదారి పక్కనున్న అలోక్ ఫామ్ హౌస్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కొంతమంది వ్యక్తులు ఫాంహౌజ్‌లో పెద్ద ఎత్తున నగదుతో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం రాగా గజ్వేల్ ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి ఆకస్మికంగా రైడ్ చేశారు. 25 మంది పేకాటరాయుళ్ళను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు. వారి వద్ద నుండి 10,46,000 రూపాయలతో పాటు 26 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొన్నారు. నిందితులను గజ్వేల్ కోర్టులో హజరు పర్చగా వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు వారిని సంగారెడ్డి జైలుకు తరలించారు.

acp

ఈ సందర్భంగా విలేఖరులతో ఏసీపీ రమేష్ మాట్లాడుతూ.. అసాంఘిక కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేదిలేదన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రామాలలో, ఫామ్ హౌస్‌లలో, ఇళ్ళల్లో పేకాట, జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే డయల్ 100, లేదా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 7901100100, గజ్వేల్ ఏసీపీ 8333998684 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed