- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మహా’ లొల్లిలో పోలీసులు ఫెయిల్?
దిశ, క్రైమ్ బ్యూరో: గ్రేటర్ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల అనుగుణంగా పోలీసు శాఖ పెద్ద ఎత్తునా బలగాలను రంగంలోకి దించింది. నగర వ్యాప్తంగా 150 డివిజన్లలో పోలీసులు పెద్ద ఎత్తునా విధుల్లో పాల్గొన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా పోలింగ్ బూత్‌లకు 100 మీటర్ల దూరంలో పార్టీల కార్యకర్తలు ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ముగ్గురు లేదా నలుగురు సిబ్బందిని విధుల్లో ఉంచారు. అయినా.. గ్రేటర్ వ్యాప్తంగా అనేక పోలింగ్ బూత్‌ల వద్ద ఉద్రిక్తతతో కూడిన వాతావరణం నెలకొంది. పలు చోట్ల పొలిటికల్ లీడర్లు, కార్యకర్తల మధ్య జరిగిన గొడవలను నివారించేందుకు పోలీసు సిబ్బంది ప్రయత్నించలేదు. కేవలం వీడియోలు తీయడానికే మాత్రమే పరిమితమయ్యారు.
అన్నింటా ఘర్షణలే!
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం పోలీస్ శాఖ భారీగా బలగాలను ఉపయోగించింది. వాస్తవానికి ముందుగా 25-30 వేల పోలీసు సిబ్బందిని మాత్రమే ఎన్నికల బందోబస్తుకు వినియోగించాలని ఎస్ఈసీ భావించింది. కానీ నగరంలో ఆయా పార్టీల నేతల ఉద్రిక్తతలను పెంచే ఉపన్యాసాలతో బల్దియా ఎన్నికల ప్రచారం మరింతా హీటెక్కింది. అంతే కాకుండా, హైదరాబాద్ నగరానికి పరిమితమైన ఈ ఎన్నికలకు కేంద్ర హోం శాఖ మంత్రితో పాటు ఇద్దరు ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నాయకులు పాల్గొన్నారు. దీంతో ఎన్నికల బందోబస్తుకు 51 వేల పోలీసులను బందోబస్తుకు పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 22 వేలు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 13,500, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 10 వేల మంది పోలీసులతో పాటు ఇతర బలగాలను కూడా పోలీస్ శాఖ ఉపయోగించింది. అయినప్పటికీ, డివిజన్లలో రాజకీయ పార్టీల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ, ఉద్రిక్తలను నివారించడంలో పోలీసులు విఫలమైనట్టుగా విమర్శలు వస్తున్నాయి. శుక్రవారం కౌంటింగ్, ఫలితాలు ఉండటంతో పోలీసులు స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టారు. ఘర్షణ వాతావరణాన్ని లేకుండా చేసేందుకు పోలీసు శాఖ విజయోత్సవ ర్యాలీలను 48 గంటల పాటు నిర్వహించకూడదనే ఆంక్షలను విధించింది. కౌంటింగ్, ఫలితాలు సందర్భంగానైనా గొడవలను నివారించడంలో పోలీసులు సక్సెస్ అవుతారో లేదో వేచి చూడాల్సిందే.
బలగాలు మోహరించినా..