- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బైక్‌పై ఒక్కరే ప్రయాణించాలి : కమిషనర్
దిశ, సిద్దిపేట: కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రతిఒక్కరూ పోలీసుల సూచనలు పాటించాలని, కరోనా నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… మాస్కులు లేకుండా ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావొద్దని, మోటార్ సైకిల్‌పై ఒకరు మాత్రమే ప్రయాణించాలని, ప్రయాణించే సమయంలో తప్పకుండా హెల్మెట్, మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు.
ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే ఇద్దరు ప్రయాణించాలని అన్నారు. ఆటోలో అయితే ముగ్గురు మాత్రమే ప్రయాణించాలని, ప్రయాణించే సమయంలో అందరూ తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించారు. నిత్యవసర కొనుగోలు గురించి కిరాణా షాపుల వద్ద, కూరగాయల మార్కెట్ వద్ద మొబైల్ షాప్‌ల వద్ద బస్టాండ్లలో భౌతికదూరం పాటించాలన్నారు. నియమనిబంధనలు పాటించి పోలీసు శాఖకు సహకరించాలని, లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.