కాళేశ్వరం బోర్డర్‌లో టెన్షన్ టెన్షన్..

by Sridhar Babu |   ( Updated:30 March 2021 12:49 AM  )
కాళేశ్వరం బోర్డర్‌లో టెన్షన్ టెన్షన్..
X

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా బోర్డర్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మహదేవపూర్ మండలం కాళేశ్వరం అంతర్రాష్ట్ర బ్రిడ్జి వద్ద కాళేశ్వరం ఎస్ఐ నరహరి ఆధ్వర్యంలో మంగళవారం వాహన తనిఖీలు చేపట్టారు. సోమవారం మహారాష్ట్రలోని గడ్చిరౌలిలో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. పోలీస్ నిఘావర్గాల హెచ్చరిక మేరకు అప్రమత్తమైన పోలీసులు తెలంగాణ, మహరాష్ట్ర సరిహద్దు గల కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద మావోయిస్టులు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావివ్వకుండా ముందస్తుగా భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి.

ఇరు రాష్ట్రాల నుంచి కాళేశ్వరం అంతర్రాష్ట్ర బ్రిడ్జి మీదుగా రాకపోకలు కొనసాగిస్తున్న వాహనలను నిలిపి తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించి వదిలేశారు. అనుమానిత వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో ట్రైనింగ్ ఎస్‌ఐలు సివిల్, సీఆర్పీఎఫ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed