- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యువకులను చితక్కొట్టిన పోలీసులు
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లాలో మైలవరంలో ఇద్దరు యువకులను పోలీసులు చితకబాదారు. సదరు యువకులు తెలంగాణ నుంచి మద్యం తీసుకొస్తుండగా ఎక్సైజ్ అధికారులు మైలవరంలో ఆపి సోదా చేశారు. మద్యం బాటిళ్లు కనిపించడంతో వారిపై దాడి చేశారు.
మద్యం సీసాలకు అనుమతుందని.. కోర్టు పర్మిషన్ ఇచ్చిందని… తమనెందుకు ఆపారని యువకులు పోలీసులను ప్రశ్నించారు. దీంతో యువకులను రోడ్ సేఫ్టీ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు విచక్షణారహితంగా దాడి చేశారు. యువకులను బలవంతంగా కారులో ఎక్కించే ప్రయత్నం చేశారు. తమపైనే యువకులు ఎదురుదాడికి దిగారని పోలీసులు చెబుతున్నారు. ఏ తప్పు చేయకుండానే పోలీసులు మాపై దాడి చేశారని యువకులు ఆరోపిస్తున్నారు.
Next Story