శుభవార్త చెప్పిన ప్రధాని మోదీ

by Shamantha N |
శుభవార్త చెప్పిన ప్రధాని మోదీ
X

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ రోజు కేంద్ర మంత్రి చేసిన ప్రకటనలు.. దేశంలో నగదు లభ్యతను పెంచుతాయని తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా కుదేలైన పరిశ్రమలు ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఆర్థిక మంత్రి తన ప్రకటనల్లో గుర్తించారని తెలిపారు. ఆమె ప్రకటనలతో నగదు లభ్యత పెరగడమే కాదు… పారిశ్రామిక ఔత్సాహికులకు సాధికారులను చేస్తుందని, పోటీ పడేలా బలోపేతం చేస్తుందని ట్వీట్ చేశారు. మంగళవారం జాతినుద్దేశిస్తూ ప్రధాని.. రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్బీఐ సహా కేంద్రం ప్రకటించిన కరోనా ప్యాకేజీలు కలుపుకుని ఈ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్టు వివరించారు. ఈ ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి దశలవారీగా వెల్లడిస్తారని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే బుధవారం సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ వివరాలను వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed