మన్ కి బాత్‌‌లో లాక్‌డౌన్ 5.0 ప్రకటన?

by vinod kumar |   ( Updated:2020-05-27 09:36:28.0  )
మన్ కి బాత్‌‌లో లాక్‌డౌన్ 5.0 ప్రకటన?
X

న్యూఢిల్లీ : దేశంలో లాక్‌డౌన్ 4.0 ఈ నెల 31(చివరి ఆదివారం)తో ముగుస్తున్నందున ప్రధాని నరేంద్ర మోడీ మన్ కి బాత్ కార్యక్రమంలో మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలోనే లాక్‌డౌన్ 5.0కి సంబంధించిన ప్రకటన ఉండే అవకాశముందని సమాచారం. లాక్‌డౌన్ పాటిస్తున్న ప్రజలను ప్రశంసిస్తూనే తదుపరి దశలో ఉండే సడలింపుల వివరాలను ప్రకటించవచ్చునని కొన్ని వర్గాలు తెలిపాయి. లాక్‌డౌన్ 5.0లో కేంద్ర ప్రభుత్వం.. దేశంలోని మొత్తం కేసుల్లో 70 శాతం కేసులున్న 11 నగరాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు వివరించాయి. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, పూణె, థానె, ఇండోర్, చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, సూరత్, కోల్‌కతా ప్రత్యేకంగా నజర్ వేయనున్నట్టు తెలుస్తోంది. మతపరమైన ప్రార్థనలకు అనుమతినివ్వాలని ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మతపరమైన స్థలాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపులనిచ్చే అవకాశముందని పేర్కొన్నాయి. అయితే, ప్రార్థనా వేడుకలు, మతపరమైన కూటములకు అనుమతినివ్వకపోవచ్చు. జిమ్‌లకు ఈ లాక్‌డౌన్ నుంచి మినహాయింపునిచ్చే అవకాశముందని వివరించాయి. కానీ, సామాజిక దూరం, మాస్కుల వినియోగం లాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా ఎప్పటిలాగే కొనసాగుతాయని తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed