యావత్ భారతం శోక సంద్రంలోకి.. : ప్రధాని

by Anukaran |   ( Updated:2020-08-31 08:58:18.0  )
యావత్ భారతం శోక సంద్రంలోకి.. : ప్రధాని
X

న్యూఢిల్లీ: భారత రత్న ప్రణబ్ ముఖర్జీ కన్నుమూతతో యావత్ భారతం శోకసంద్రంలో మునిగిపోయిందని, దేశాభివృద్ధిలో ఆయన చెరగని ముద్రవేసుకున్నారని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. విద్యావంతుడు, రాజనీతిజ్ఞుడైన ప్రణబ్ ముఖర్జీని పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు, సమాజంలోని అన్ని వర్గాలు ఆదరించేవారని వివరించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఆయన విలువైన సలహాలు, సూచనలను తీసుకున్నారని ప్రధాని తెలిపారు. ఆయన సాన్నిహిత్యాన్ని ఎంతో ఆస్వాదించేవారని, ప్రణబ్ కుటుంబీకులు, ఆయన మిత్రులు, మద్దతుదారులు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. భారత రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవన్‌ను సాధారణ పౌరులకు మరింత చేరువచేశారని, రాష్ట్రపతి భవన్‌ను నేర్చుకోవడానికి, ఆవిష్కరణలు, సంస్కృతికి, సైన్స్, సాహిత్యానికి కేంద్రంగా మలిచారని ప్రధాని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed