ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ‘భారతీయ రైల్వే’.. భారీగా టిక్కెట్ ధరల తగ్గింపు..!

by Anukaran |
ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ‘భారతీయ రైల్వే’.. భారీగా టిక్కెట్ ధరల తగ్గింపు..!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. ఇన్నిరోజులు అధిక టికెట్ ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కొంతమేర ఉపశమనం కల్గించే నిర్ణయం తీసుకుంది. కొవిడ్ సమయంలో పెంచిన ఫ్లాట్‌ఫాం టికెట్ ధరలను తగ్గిస్తూ గురువారం ప్రకటన చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరలను తగ్గించగా, సెంట్రల్ రైల్వే పరిధిలోని కేవలం ముంబై డివిజన్‌లో మాత్రమే ధరలను తగ్గించలేదని తెలిసింది. ప్రస్తుతం మహారాష్ట్రలో కొవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ ధరలను తగ్గించినట్టు తెలుస్తోంది.

ఈ ఏడాది ప్రారంభంలో కొవిడ్ పాండమిక్ మూలంగా ముంబై డివిజన్ పరిధిలోని రద్దీ రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధరలను రూ.10 నుంచి 50కు పెంచింది ఇండియన్ రైల్వే. కాగా, ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులోకి రావడంతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లోని కీలక స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ ధరను రూ.50 నుంచి 10కి తగ్గించాలని సెంట్రల్ రైల్వే నిర్ణయించినట్టు ఓ అధికారి తెలిపారు. ఈ నిర్ణయం ప్రకారం.. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) దాదర్, లోకమాన్య తిలక్ టెర్మినస్ (LTT) థానే, కళ్యాణ్ మరియు పన్వెల్ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ ధర తగ్గనుంది.

Advertisement

Next Story