'ప్లీజ్ బీసీసీఐ.. మమ్మల్ని వదిలేయండి'

by Shyam |
ప్లీజ్ బీసీసీఐ.. మమ్మల్ని వదిలేయండి
X

దిశ, స్పోర్ట్స్: ‘బీసీసీఐ.. ఇక మమ్మల్ని వదిలేయ్.. మా ఆట మేం ఆడుకుంటాం. ఇప్పటికైనా మాలాంటి వారిని వదిలేస్తే.. ఇతర లీగ్స్‌లో కూడా ఆడుకుంటాం’ అని సీనియర్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అంటున్నాడు. భారత్ తరపున 59 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఈ కర్ణాటక ఆటగాడు.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 13లో రాజస్థాన్ రాయల్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఆటగాళ్లందరూ ఇంటికే పరిమితమైన నేపథ్యంలో క్రికెటర్ సురేష్ రైనాతో కలసి బీబీసీ నిర్వహిస్తోన్న పోడ్‌కాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. బీసీసీఐ ఇప్పటికైనా మాజీ క్రికెటర్లను ఇతర దేశాల్లో జరిగే క్రికెట్ లీగ్స్‌లో ఆడటానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నాడు. మమ్మల్ని ఇతర లీగ్స్‌లో ఆడకుండా నిరోధించడం అంటే అవమానించడమే అంటున్నాడు. ఇది చాలా బాధపెడుతోందని ఊతప్ప చెబుతున్నాడు. మాకు క్రికెట్ తప్ప మరేమీ తెలియదు. వయసులో ఉన్నప్పుడే ఆడగలం కానీ.. వయసు మీరిన తర్వాత బీసీసీఐ అనుమతించినా ఆటనే ఆడలేము. కాబట్టి టీం ఇండియాకు ప్రాతినిథ్యం వహించలేని మమ్మల్ని ఇతర లీగ్స్ ఆడటానికి అనుమతించాలని కోరుతున్నాడు. బీసీసీఐతో కానీ, ఐసీసీతో కానీ కాంట్రాక్టు లేని క్రీడాకారులు ఇతర లీగ్స్‌లో ఆడటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని.. వారిని తప్పకుండా అనుమతించాలని కోరుతున్నాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి అన్ని సీజన్లు ఆడిన రాబిన్ ఊతప్ప.. ప్రస్తుతం రాజస్థాన్ జట్టులో ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed