న్యాయం కోసం డీఐజీకి దివ్యాంగురాలు ఫిర్యాదు.

by Sumithra |
న్యాయం కోసం డీఐజీకి దివ్యాంగురాలు ఫిర్యాదు.
X

దిశ, వెబ్ డెస్క్: తనపై అక్రమ కేసులు పెట్టించి, తనకు మానసికంగా, ఆర్థికంగా నష్టం కలిగిస్తున్న వ్యక్తిని శిక్షించాలని డీఐజీకి ఉమా అనే దివ్యాంగురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి వివరాల ప్రకారం.. మహబాద్ జిల్లా కొరివి మండలం రాజోలు గ్రామానికి చెందిన తోట ఉమను తొర్రూర్ కు చెందిన మోదుగుల మోహన్ రావు మోసం చేశాడు. ఐదేండ్ల క్రితం ఆమె ఇంటికి మోహన్ రావు వెళ్లాడు. తనను తాను ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరునిగా అతను పరిచయం చేసుకున్నాడు. మహబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్స్ కాలనీలో ఇంటి స్థలం ఇప్పిస్తానని ఉమను అతను నమ్మించాడు. దీంతో ఆమె కుట్టు పని చేసి సంపాదించిన ఐదు లక్షల రూపాయలను అతనికి ఆమె ఇచ్చింది. ఆ తర్వాత నుంచి మోహన్ రావు మొహం చాటేశాడు. దీంతో ఆమె పంచాయితీ పెట్టగా డబ్బులు తిరిగి ఇచ్చివేస్తానని ప్రామిసరీ నోటు రాసి ఇచ్చాడు. కాగా డబ్బులు అడగ్గా వాయిదాల పేరిట తిప్పించాడు. దీంతో జిల్లా ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మోహన్ రావు తీసుకున్న డబ్బులను తాము చెల్లిస్తామని అతని తల్లిదండ్రులు ఒప్పుకుని బాండ్ రాసి ఇచ్చారు. దీంతో వాయిదా ప్రకారం డబ్బులను అడిగేందుకు వెళ్లిన ఆమె, అతని సోదరునిపై వారు హత్యాయత్నం చేశారు. ఆ తర్వాత ఆమెపై అక్రమ కేసులు పెట్టించారు. దీంతో మోహన రావుపై చర్యలు తీసుకోవాలనీ, తనపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని డీఐజీని ఆమె కోరింది.

Advertisement

Next Story