- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాపైనే దాడులకు దిగుతారా..? ఎంపీవోల ఆగ్రహం
దిశ, కారేపల్లి : ఉమ్మడి ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) టీవీఎల్‌ఎన్ శాస్త్రీ పై దాడిని నిరసిస్తూ బుధవారం మండల పరిషత్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపీడీవో కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు, ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. తమ విధుల నిర్వహణను అడ్డుకునే ఉద్దేశ్యంతో పలుకుపడితో భౌతికదాడులకు దిగటం క్షమించరాని నేరమని ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. దాడులతో ఉద్యోగుల మానసిక స్థైర్యం దెబ్బతింటుందన్నారు.
ఎంపీవోపై దాడికి పాల్పడిన వారిపై తక్షణమై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు విధి నిర్వాహణలో రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సూపరింటెండెంట్ జీఎస్‌ఆర్ మూర్తి, ఏపీవో రంగనాయకమ్మ, ఈసీ చంద్రశేఖర్, కార్యదర్శుల సంఘం అధ్యక్షులు భూక్యా తిలక్ కిషోర్, కార్యదర్శి అశోక్, కోశాధికారి మాలోత్ భాస్కర్ నాయకులు నాగేంద్రబాబు, నాగలక్ష్మి, గుగులోత్ సురేష్, యాకలక్ష్మి, రోజా, గౌతమి, లావణ్య అనురాధ తదితరులు పాల్గొన్నారు.