బ్రేకింగ్.. కూలిన మిలటరీ విమానం.. 17 మంది జవాన్లు మృతి..

by vinod kumar |   ( Updated:2021-07-04 01:44:49.0  )
philippines-Army Flight-Accident
X

దిశ, వెబ్‌డెస్క్ : దక్షిణ ఫిలిప్పీన్స్‌లో మిలటరీ విమానం ఆదివారం ఉదయం ప్రమాదానికి గురైంది. ఆ దేశానికి చెందిన సీ-130 విమానం సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపంలో రన్ వే పై దిగే సమయంలో అదుపు తప్పి క్రాష్ అయినట్టు ఫిలిప్పీన్స్ ఆర్మీ చీఫ్ సిరిలిటో సోబెజనా ఆ దేశ వార్తా సంస్థ ఏఎఫ్‌పీకి తెలిపారు. అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 85 మంది జవాన్లు ఉన్నట్టు తెలుస్తోంది. శిథిలాల కింద నుంచి 40 మందిని కాపాడినట్టు ఆర్మీ చీఫ్ వెల్లడించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 17 మంది జవాన్లు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story