- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
వరుస లాభాల్లో మార్కెట్లు..
ముంబయి: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస లాభాలను కొనసాగించాయి. సోమవారం ఫార్మారంగ సూచీలు గణనీయంగా లబ్ధి పొందడంతో బీఎస్‌ఈ (BSC), ఎన్ఎస్ఈ (NSE)లో సూచీలు రాణించాయి. సెన్సెక్స్ గరిష్ఠంగా 390 పాయింట్లు, నిఫ్టీ (NIFTY) 11,300 పాయింట్లను తాకింది. సూచీలు గరిష్ఠ స్థాయిని తాకినప్పుడు చివరి గంటలో పెట్టుబడిదారులు (INVESTORS) లాభాల స్వీకరణకు దిగారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ (SENSEX)141.51 పాయింట్లు లబ్ధి పొంది 38,182.08 వద్ద ముగిసింది. నిఫ్టీ 56.10 పాయింట్ల లాభాంతో 11,270.15 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్‌లో లార్సన్ అండ్ టర్బో, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ (ICICI), హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంకులు, మహీంద్రా అండ్ మహీంద్రా (MAHINDRA AND MAHINDRA) అత్యధికంగా లాభాలు పొందిన వాటిలో ఉన్నాయి.
నిఫ్టీలోని 11 రంగాల సూచీలు రాణించాయి. గరిష్ఠంగా నిఫ్టీ ఫార్మా సూచీలు 5 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ (NIFTY) రియాల్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్, ఐటీ, మెటల్ రంగ సూచీలు 0.6 నుంచి 2.8శాతం మధ్యలో లబ్ధి పొందాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు 1శాతం మేరకు రాణించాయి. నిఫ్టీలో రికార్డు స్థాయిలో సిప్లా (CIPLA) సూచీలు రాణించాయి. మొదటి త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో గరిష్ఠంగా 12 శాతం పెరిగి సిప్లా షేరు ధర రూ.814.50కు చేరుకున్నది. జూన్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికంలో నికర లాభం రూ.577.91కోట్లుగా సిప్లా ప్రకటించింది.
అంతకుముందు సంవత్సరంలో పోలిస్తే ఇది 20.85శాతం అధికం కావడం గమనార్హం. లార్సన్ అండ్ టర్బో, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా (TATA)మోటార్స్, సన్ ఫార్మా (SUN PHARMA) , ఎన్‌టీపీసీ (NTPC) , టీక్ మహీంద్రా (TECH MAHINDRA), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ (REDDYS LABS), శ్రీ సిమెంట్స్, యూపీఎల్ (UPL), జేఎస్‌డబ్ల్యూ స్టీల్, భారతీ ఇన్‌ఫ్రాటెల్ (BHARATHI INFRATEL) సూచీలు కూడా 2 నుంచి 2.5శాతం మధ్యలో లాభ పడ్డాయి. మరోవైపు ఈచర్ మోటార్స్, ఏసియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ (MARUTHI SUZUKI), రిలయన్స్ ఇండస్ట్రీస్ (RELIANCE), అల్ట్రా టెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్ నష్టపోయిన వాటిలో ఉన్నాయి. మొత్తంగా బీఎస్‌ఈలో 1,747 సూచీలు లాభపడగా, 1002 సూచీలు నష్టపోయాయి.