సీఎంఆర్ఎఫ్‌కు పెట్రోలియం డీలర్లు రూ. లక్ష విరాళం

by Shyam |
సీఎంఆర్ఎఫ్‌కు పెట్రోలియం డీలర్లు రూ. లక్ష విరాళం
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. లక్ష విరాళం ప్రకటించారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా తమ వంతు సాయం అందించేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వెళ్లి చెక్కు రూపంలో విరాళం అందజేసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వెంకట నర్సాగౌడ్, కార్యదర్శి వినోద్, సలహాదారులు దినేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: corona, lock down, 1 lac donate, cmrf fund, petrolium delaers association

Advertisement

Next Story