పెట్రోల్ ట్యాంకర్ బోల్తా.. ఎగబడ్డ జనాలు

by srinivas |
పెట్రోల్ ట్యాంకర్ బోల్తా.. ఎగబడ్డ జనాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా గన్నవరం హైవేపై ఆదివారం ఉదయం పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడింది. దీంతో రోడ్డుపై పెట్రోల్ వృధాగా వరదలు పారుతోంది. గమనించిన స్థానికులు పెట్రోస్ కోసం బాటిళ్లతో ఎగబడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చెదరగొట్టారు. గత 20 రోజులుగా భారీగా పెట్రోల్ ధరలు పెరగడంతో జనాలు ఈ విధంగా పెట్రోల్ కోసం ఎగబడటం గమనార్హం.

Advertisement

Next Story