మళ్లీ బాదారు.. హైదరాబాద్‌లో పెట్రోల్ @100

by Shyam |   ( Updated:2021-06-10 21:53:43.0  )
మళ్లీ బాదారు.. హైదరాబాద్‌లో పెట్రోల్ @100
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా విపత్కర కాలంలో ఇంధన ధరలు రోజురోజుకూ పెరగడం సామాన్యుడిని మరింత కష్టాల్లోకి నెట్టివేస్తోంది. వరుసగా దేశీయ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ చార్జీలను పెంచడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన ధరలకు కళ్లెం వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసలే పనులు దొరక్క, చేతిలో డబ్బుల్లేక అల్లాడుతున్న సామాన్య ప్రజానీకానికి ఇంధన చార్జీల పెంపు పెను భారంగా మారింది.

దీనికి తోడు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం దేశంలో పెట్రోల్, డీజిల్‌పై రూ.29 పైసల చొప్పున ధర పెంచుతూ కేంద్రం నిర్ణయించింది. తాజా పెంపుతో గుంటూలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.04, డీజిల్ రూ.96.39 ఉండగా, లీటర్ ప్రీమియం పెట్రోల్ రూ.105.50కు చేరుకుంది. ఇప్పటికే విజయవాడలో పెట్రోల్ సెంచురీ మార్క్ దాటింది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.99.61, డీజిల్ రూ.94.56 వద్ద కొనసాగుతోంది. మరో రెండ్రోజులు ఇంధనంపై వడ్డన ఇలానే కొనసాగితే నగరంలో పెట్రోల్ సెంచురీ మార్క్ క్రాస్ చేయనుంది.

Advertisement

Next Story

Most Viewed