షహీన్‌బాగ్‌పై పెట్రోల్‌బాంబు దాడి

by Shamantha N |
షహీన్‌బాగ్‌పై పెట్రోల్‌బాంబు దాడి
X

న్యూఢిల్లీ : ఢిల్లీలోని షహీన్‌బాగ్ సీఏఏ వ్యతిరేక ఆందోళనకారుల ప్రదర్శన శిబిరంపై ఆదివారం ఉదయం దుండగులు పెట్రోల్ బాంబు విసిరారు. కనీసం ఒకరిద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి పెట్రోల్ బాంబును విసిరేసి పారిపోయినట్టు స్థానికులు తెలిపారు. ఘటన అనంతరం స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. ఐదారు పెట్రోల్ నింపిన బాటిళ్లను కనుగొన్నట్టు వివరించారు. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేవని సమాచారం. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో షహీన్‌బాగ్‌లో ఆందోళన విరమించాలని పలువురు సూచించారు. ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని ఇచ్చిన పిలుపునూ ఆందోళనకారులు ఆచరించలేదు. సామాజిక దూరాన్ని పాటిస్తూ ఆందోళన కొనసాగిస్తామని వారు తెలిపారు. తాజాగా, ఈ దుర్ఘటన జరిగింది.

Tags: shaheenbagh, protest, petrol bomb, attack, curfew day

Next Story

Most Viewed