ఆసీస్ ప్లేయర్‌కు కరోనా

by Shyam |   ( Updated:2021-07-12 11:34:34.0  )
Handscomb
X

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా క్రికెటర్ పీటర్ హాండ్స్‌కాంబ్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో మిడిలెక్స్ తరపున కౌంటీ క్రికెట్ ఆడుతున్న హాండ్స్‌కాంబ్ తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలాడు. దీంతో అతడిని కౌంటీ యాజమాన్యం వెంటనే ఐసోలేషన్‌కు పంపింది. మిడిలెక్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హ్యాండ్స్‌కాంబ్ స్థానంలో ఐర్లాండ్‌కు చెందిన ముర్తగ్‌ను కెప్టెన్‌గా నియమించింది. కౌంటీ చాంపియన్‌షిప్ రెండో గ్రూప్ మ్యాచ్ లీసెస్టర్‌షైర్‌తో జరుగనుండగా.. ఆ మ్యాచ్‌కు ముర్తగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని యాజమాన్యం తెలిపింది. ఇంగ్లాండ్ వెళ్లిన పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడటానికి వెళ్లిన శ్రీలంక క్రికెటర్లు తొలుత కరోనా బారిన పడగా.. శ్రీలంక వచ్చిన తర్వాత బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, డేటా అనలిస్ట్ నిరోషన్ కరోనా కారణంగా ఐసోలేషన్‌లోకి వెళ్లారు.

Advertisement

Next Story